Sri Kanchi Kamakoti Peetam Kanchipuram
Published on Jun 18, 2015
Anugraha Bhashanam in Telugu
మన ధర్మము సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మము అతి
ప్రాచీనమైన ధర్మము. ఎప్పుడు సృష్టి అనేది ప్రారంభం చేయబడిందో ఆ సమయమునుంచే
సృష్టింపబడిన జీవరాశులు మంచి సదాచారముతో ఈశ్వరభక్తితో మంచి ఆలోచనలతో జీవితములో
కార్యక్రమాలు చేసి గురుభక్తితో ఈశ్వర భక్తితో నిర్విఘ్నముగా మంచికార్యాన్ని
చేసుకోవాలని ఆలోచించి ఈ ధర్మాన్ని, వేదాన్ని మనకందిచినారు. ధర్మోవిశ్వస్య జగతః ప్రతిష్టా.. ఈ ధర్మం చేత మనం
చేయవలసిన కార్యక్రమాలు చేయరాని కార్యక్రమాలు అన్నీ తెలుసుకొని, చేయవలసిన కార్యక్రమాలను మంచిగా చేసి. ఏవైతే మనం చేయకూడదో వాటిని
దూరంపెట్టి, మన శాస్త్ర సంప్రదాయాలను మంచిగా ఆచరించాలి.
రాగద్వేషాలు జీవితంలో సహజసిద్ధంగా కొన్ని ఉన్నా, మంచి
విషయంలో రాగాన్ని పెంచుకొని, శ్రద్ధను పెంచుకొని, ఆసక్తిని మనం అభివృద్ధి చేసుకొని మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. మన భారతదేశం లో ఋషులు, మహాత్ములు,
మహనీయులు ఇక్కడ తపస్సు చేసి ఈశ్వర భక్తిని చేసి అత్యుత్తమమైన ఒక
జీవన విధానాన్ని అందించారు.
పవిత్రమైన జీవిత చర్య
ఉత్తమమైన ఉదారమైన ఆలోచన
ఉపకారకమైన జీవితం - పది మందికి సహాయం చేసే జీవితము,
విస్తృతమైన ప్రార్థన , విశాలమైన ప్రార్థన "లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ ఇదీ
మన దేశం యొక్క ప్రార్థన.
ఈ విధంగా లౌకికమైన జీవితంలో కూడా మన ఆహారపద్ధతి, మన అలంకార పద్ధతి, మన
ఆచారపద్ధతి అన్నీకూడా ఋషి జీవితాన్ని అనుసరించి సాత్వికమైన పద్ధతిలో ఆడంబరం
లేకుండా ఎంత అవసరమో అంత మాత్రమే మనం ఖర్చులుగానీ, లౌకికమైన
ఆలోచనలు కానీ పరిమితం చేసుకొని లోక క్షేమానికి కృషిచేయడమనేది మన శాస్త్రం
బోధించే ధర్మము.
వేదాంత విచారాన్ని పూర్తిగా చేయలేకపోయినాకూడా
అప్పుడప్పుడూ మనం ధ్యానం చేయడం, ఉపవాసం చేయడం, మౌన వ్రతాన్ని అనుష్ఠించడం ఈ విధంగా
ఋషి చర్యని మనసుపెట్టి చేయాలి. ఈ భారత దేశం బ్రహ్మచారి, గృహస్థ,
వానప్రస్థ, సన్యాసాశ్రమాన్ని ప్రచారానికి
తీసుకువచ్చింది. గురు అనుగ్రహంతో విఘ్నేశ్వర దేవాలయంలో మీరందరూకూడా చమక నమక ప్రశ్నాన్ని అనుసంధానం చేసుకోవడం,
సువాసినీ పూజ, కన్యకా పూజ, కన్యకాపూజ అనేది తరతరాలుగా వస్తున్న మంచి విషయము. కన్యాపూజన సుప్రసన్న
హృదయాం అని అమ్మవారి గురించి చెప్పబడింది. ఈ కన్యకా పూజ చేస్తే అమ్మవారు మనసు
సంతోషించి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుందని చెప్పబడింది. ఈ విధంగా మీరందరూ
శాస్త్ర సంప్రదాయాన్ని దూర దేశంలో ఉన్నా సదుద్దేశంతో ఈ విషయాల్ని చేయడం. జుట్టు,
బొట్టు, కట్టు అంటాం.. తెలుగు భాష మాట్లాడే
వాళ్ళు ఆ విధంగా మన సదాచార సంస్కృతీ సభ్యతల్నీ మంచి నమ్మకంతో పదిమందీ కూడా కలిసి
ఇంట్లో కూడా ఆచరించి మంచి పరంపరలో వచ్చినారు గనక, ఆ
పరంపరగతమైన ధర్మాన్ని చక్కగా ఆచరించి ఈశ్వర అనుగ్రహం పొందడానికి అందరూ ప్రయత్నం
చేయాలి
హర హర నమః పార్వతీ పతయే నమః
No comments:
Post a Comment